మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోయినా.. ఉపాసన మాత్రం ఎప్పటికప్పుడు చెర్రీకి సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. తాజాగా జిమ్ లో చరణ్, ఉపాసనలు వర్కవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన ఉపాసన ‘ఏడు రోజుల ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రొగ్రామ్‌లో నన్ను ప్రోత్రహించేందుకు మిస్టర్ సి నాతోపాటు వర్క్ అవుట్ చేశారు’ అంటూ ట్వీట్ చేశారు.