ఇటీవల కాలంలో అటు ఆటలోనూ ఇటు సంపాదనలోనూ భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో శతకం సాధించడం ద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచిన కోహ్లి.. ఆర్జనలో కూడా తనదైన ముద్రను చూపెడుతున్నాడు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యంత విలువైన టాప్ -10 అథ్లెట్లలో కోహ్లి ఏడో స్థానానికి ఎగబాకాడు.