తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్సార్ సీపీ ఎన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆ పార్టీనేత బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. రాష్ట్రానికి సమన్వాయం చేయలేనప్పుడు, రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని మాత్రమే వైఎస్సార్ సీపీ కోరుతుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో వైఎస్సార్ సీపీ ఉనికి కోల్పోతుందన్న టీఆర్ఎస్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీకి బలం ఉందో లేదో టీఆర్ఎస్ నేతలు నిర్ణయించనక్కర్లేదన్నారు. వైఎస్సార్ సీపీ హవాను తగ్గించాలనే టీఆర్ఎస్ విమర్శలకు దిగుతుందన్నారు. టీఆర్ఎస్ నేత హరీష్ రావు విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ది చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ వాదంతో పుట్టిన పార్టీ అని, మిగతా పార్టీలు ఏవీ కూడా అలా ఏర్పడలేదన్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
Sep 5 2013 5:50 PM | Updated on Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement