హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తేల్చి చెప్పారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఒకవేళ విభజన అనివార్యమైతే రాయల తెలంగాణకే తాము మొగ్గు చూపుతామన్నారు. అసదుద్దీన్ కేంద్రపాలితం ఆలోచనే కాకుండా.. ఉమ్మడి రాజధానిపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్పై కేంద్రం పెత్తనాన్ని సహించేది లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. షరతులు లేని రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్నారు. విభజనపై ఏర్పాటు అయిన జీవోఎంకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ....మజ్లీస్ 46 పేజీల నివేదిక పంపింది. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు వెంటనే కొత్త రాజధాని ఏర్పాటు సత్వర చర్యలు చేపట్టాలని ఎంఐఎం తన లేఖలో కోరింది. విడదీయాల్సి వస్తే రాయలసీమలోని నాలుగు జిల్లాలను కలిసి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆపార్టీ సూచించింది.
Nov 6 2013 11:48 AM | Updated on Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement