ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం కొనసాగిస్తామని టీ జేఏసీ కన్వీనర్ ప్రొ.కోదండరామ్ స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ప్రారంభమైన టీజేఏసీ రౌండ్ టేబులు సమావేశం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... గతంలో చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందాన్ని కాలరాశారన్నారు. తెలంగాణ సమస్య వెనకబాటుతనమే కాదు, రాజకీయ సమస్య కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. నీటిపారుదల రంగంలో తెలంగాణాకు అన్యాయమే జరిగిందని కోదండరామ్ గుర్తు చేశారు. ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు బలమైన వారని ఆయన అభివర్ణించారు. అంధ్ర ప్రాంతంలో రెవెన్యు రాబడి చాలా తక్కువ అని కోదండరామ్ పేర్కొన్నారు.