పాకిస్తాన్ విషయంలో కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా పూర్తి మద్దతు ఉంటుందని అఖిలపక్షం తెలిపింది. ఉడీ ఘటనకు ప్రతీకారంగా జరిపిన ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులను ప్రశంసించింది. కేంద్ర హో మంత్రి రాజ్‌నాథ్ నాయకత్వంలో గురువారం సాయంత్రం అఖిలపక్ష భేటీ జరిగింది. సర్జికల్ దాడుల విధానాన్ని కేంద్రం వివరించింది. కుప్వారా, పూంచ్ సెక్టార్ల వెంబడి ఎల్వోసీలో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడి చేశామని.. డీజీఎంవో(డెరైక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్) లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ అఖిలపక్ష సభ్యులకు తెలిపారు.