గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను పోలీసులు బుధవారం విచారించారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన కృష్ణయ్యను సిట్ ఐజీ నాగిరెడ్డి ప్రశ్నించారు. గంటపాటు విచారణ కొనసాగింది. మాదాపూర్ భూమి వివాదం సెటిల్ మెంట్ పై ప్రశ్నించినట్టు సమాచారం. నయీం తనకు తెలుసునని గతంలో కృష్ణయ్య చెప్పారు. తనను నయీం గురువుగా భావించేవాడని, అతడి దందాలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.