జననేత పట్ల ఓ విద్యార్థి అభిమానం ఊళ్లు దాటేలా చేసింది. చిన్నప్పటి నుంచి తాను ఎంతగానో ఇష్టపడే వ్యక్తిని కలవాలనుకున్న అతడు.. ఇంట్లో చెప్పాపెట్టకుండా రైలెక్కేసి హైదరాబాద్ చేరుకున్నాడు. కర్నూలు జిల్లా బేతంచలర్ల మండలం ముద్దవరంకు చెందిన ఏడో తరగతి విద్యార్థి ప్రసాద్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం.