ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన అదిరేలా ఉండాలని అందుకు తగ్గట్టుగా క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆ పార్టీ ముఖ్యనేతలను ఆదేశించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, ఉపాధి కూలీల కష్టాలు తెలుసుకునేందుకు రాహుల్ ఈ నెల 24న అనంతపురం జిల్లా నల్లమాడ నుంచి ఓ.డి.చెరువు వరకు పాదయాత్ర చేపట్టనున్నారు.