ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక మిగిలే పదమూడు జిల్లాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ప్రకటించారు. రాజ్యసభలో రాష్ట్ర పనర్‌వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ చివర్లో ఆయన మాట్లాడారు.. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రకటన పూర్తి పాఠమిదీ.. ‘‘ప్రతిపక్ష నాయకుడు, మాట్లాడిన ఇతర సభ్యులందరు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సభ్యులు వెల్లడించిన అభిప్రాయాలను నేను చాలా జాగ్రత్తగా విన్నాను. రాష్ట్రానికి చెందిన అన్ని ప్రాంతాలు, ప్రత్యేకించి సీమాంధ్ర ప్రాంత ఆందోళనలను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం తీసుకోబోయే నిర్దిష్ట చర్యలను హోంమంత్రి ఇప్పటికే ప్రస్తావించారు. దీనికి సంబంధించి నేను మరికొన్ని ప్రకటనలు చేయదలచుకున్నాను.