అసెంబ్లీ లాంజ్ లో స్పీకర్ల ఫోటోలు మాత్రమే ఉంటాయని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు కమిటీ హాల్ లో ఉంటాయని చెప్పారు. విభజనలో భాగంగా కమిటీ హాల్ తెలంగాణకు వెళ్లిందని చెప్పారు. అసెంబ్లీ లాంజ్ నుంచి తొలగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి ఫోటోను తిరిగి యధాస్థానంలో పెట్టాలని డిమాండ్ చేస్తూ సభలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.