గెయిల్ పై 304 సెక్షన్‌ కింద కేసు నమోదు | nagaram tragedy case filed on gail section 304 imposed | Sakshi
Sakshi News home page

Jun 29 2014 4:39 PM | Updated on Mar 21 2024 6:35 PM

నగరం పైప్ లైన్ పేలుడు దుర్ఘటనలో గెయిల్ సంస్థపై 304 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ దుర్ఘటనలో అమాయక ప్రజలు మృత్యువాత పడ్డారనే ఆరోపణలపై గెయిల్ సంస్థపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. విచారణ ప్రకారం ఈ కేసులో మరిన్ని సెక్షన్ల విధించే అవకాశం ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో శరవేగంగా విచారణ జరుగుతోందని.. అమలాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఫొరెన్సిక్ నిపుణుల బృందం కూడా దర్యాప్తులో భాగమైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement