జిందాల్ గ్రూప్నకు బొగ్గు గనులను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగే కేటాయించారని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ...కోల్ గేట్ స్కాంకు సంబంధించి సీబీఐ కోర్టులో లిఖితపూర్వకంగా సోమవారం అఫిడవిట్ దాఖలు చేశారు. బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ను నిందితుడిగా చేర్చాలంటూ మధుకోడా చేసిన వాదనను దాసరి నారాయణరావు కూడా సమర్థించారు. బొగ్గు కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, జిందాల్ గ్రూపునకు బొగ్గు క్షేత్రాల కేటాయింపులు మన్మోహన్ సింగ్ చేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మన్మోహన్‌ను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని దాసరి పేర్కొన్నారు