రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీ నియామకం విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శివాజీ నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఆ నియామకం చట్ట విరుద్ధమని పేర్కొంది. నియామకం ఎంతమాత్రం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరగలేదంటూ తప్పుబట్టింది. ప్రభుత్వం తన ఇష్టానుసారం కావాల్సిన వ్యక్తిని నియమించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సమర్థత, నిజాయితీ ఉన్న, ఎస్సీ, ఎస్టీలకు విశిష్ట సేవలు అందించిన వ్యక్తినే సంబంధిత కమిషన్ చైర్మన్‌గా నియమించాలని తెలిపింది. నియామకంలో పారదర్శకత పాటించాలని, ఆసక్తి ఉన్న వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Nov 5 2016 7:29 AM | Updated on Mar 20 2024 3:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement