మిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్థితిపై తొలిసారి అపోలో ఆస్పత్రి భిన్నమైన ప్రకటన వెలువరించింది. ఇన్నాళ్లూ జయ కోలుకుంటున్నారని చెప్పిన వైద్యులు.. శనివారం జయకు జరుగుతున్న చికిత్సను వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో శ్లేష్మ పొరను తొలగించే మందులు వాడుతూ మరింత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని, ఫిజియోథెరపీ ద్వారా ఊపిరి తీసుకునేందుకు సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. ఇంటెన్సివిస్ట్‌ల ఆధ్వర్యంలో సీఎం ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని బులెటిన్లో పేర్కొన్నారు.