గుంటూరు జిల్లాకు చెందిన అంకిరెడ్డి విశ్వకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిడ్నీ కిడ్నాపర్ల చెరలో చిక్కుకున్నారు. ఈ విషయమై గుంటూరు జిల్లా పోలీసులకు సమాచారం అందింది. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యుల ఆచూకీ ఆరా తీసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. గత కొంత కాలంగా విశ్వకాంత్ సిడ్నీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. మొత్తం 12 మందిని కిడ్నాప్ చేయగా, వారిలో ఐదుగురు తప్పించుకున్నారు. గంట క్రితమే ఈ కిడ్నాపర్ల చెరలో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన యువకుడని తెలిసింది. విశ్వకాంత్ సోదరుడు స్థానికంగానే ఉంటారు. అతడి కిడ్నాప్ విషయాన్ని కుటుంబ సభ్యులకు అందించేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆయనను క్షేమంగా బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.
Dec 15 2014 8:23 PM | Updated on Mar 20 2024 3:12 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement