రద్దైన పాత నోట్ల చెల్లుబాటు విషయంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పలుసార్లు, పలుచోట్ల చెల్లుబాటు గడువులను పొడిగించిన కేంద్రం, డిపాజిట్ల విషయంలో అసలు తగ్గేది లేదని ప్రకటించింది. రద్దైన పాత నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు ముందుగా ప్రభుత్వం నిర్ణయించిన డిసెంబర్ 30వ తేదీనే ఆఖరని, ఈ తేదీని ఎట్టిపరిస్థితుల్లో పొడిగించేది లేదని నేడు ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. ఆర్బీఐ, బ్యాంకుల వద్ద సరిపడ నగదు ఉందని వెల్లడించింది. రద్దైన పెద్ద నోట్లను డిపాజిట్ చేయడానికి, కొత్త నగదును విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు నెలకొన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం పాత నోట్ల డిపాజిట్ల తుదిగడువును మార్చేది లేదని పేర్కొంది.
Nov 30 2016 7:49 AM | Updated on Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement