కారు - లారీ ఢీ: నలుగురు సజీవ దహనం | four-killed-in-car-accident-at-nellore-district | Sakshi
Sakshi News home page

Jan 15 2015 4:02 PM | Updated on Mar 21 2024 10:47 AM

నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారిపై విషాదం చోటు చేసుకుంది. కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. దాంతో కారులో మంటలు చెలరేగి... కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనమయ్యారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునేలోపే కారు పూర్తిగా దగ్ధమైంది. మృతులు తమిళనాడు వాసులని పోలీసులు వెల్లడించారు. వేగంతో వెళ్తున్న కారు టైరు పంక్చరు అయి... ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టండంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దహనమైన కారు నెంబర్ TM 04 AD4853 అని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement