కల్తీ మద్యం సేవించడం వల్లే కృష్ణా జిల్లా విజయవాడలో మరణాలు సంభవించినట్లు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. కల్తీ మద్యం మృతులకు మంగళవారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తిచేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చేందుకు మరో 72 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.