అలిపిరి సమీపంలోని టీటీడీ మార్కెటింగ్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో భద్రత సిబ్బంది అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో పాటు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలు అర్పుతున్నారు.అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు గోదాం భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. గోదాంలో అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కళ్యాణమస్తూ కార్యక్రమానికి వినియోగించే బియ్యం బస్తాలతోపాటు భారీగా బ్లీచింగ్ పౌడర్ బస్తాలు అగ్నికి ఆహుతి అయ్యాయని అధికారులు వెల్లడించారు. టీటీడీ గోదాంలలో తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సదరు అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Sep 3 2014 10:33 AM | Updated on Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement