పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో భాగంగా ఎలాంటి రశీదులు లేకుండా డొనేషన్ల రూపంలో వసూలు చేసిన సొమ్మును ఇప్పుడెలా చెలామణిలోకి తేవాలో అర్థం కాక యాజమన్యాలు తలపట్టుకున్నారుు. ఇటీవల చేపట్టిన మెడికల్, ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల సందర్భంగా వసూలు చేసిన డొనేషన్ల డబ్బులో కొంత మొత్తాన్ని కొన్ని యాజమాన్యాలు మాత్రమే బ్యాంకుల్లో వేసుకున్నారుు. కానీ అనేక యాజమాన్యాల వద్ద ఆ సొమ్ము బ్లాక్ మనీగానే ఉండిపోరుుంది. ఇప్పుడు వాటిని ఎలా చెలామణిలోకి తేవాలో అర్థంకాక ఆందోళనలో పడ్డారుు. బ్యాంకుల్లో వేయని సొమ్ము మాత్రమే కాదు.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ముకు లెక్కలు అడిగే అవకాశం ఉండటంతో యాజమాన్యాల్లో గందరగోళం నెలకొంది.