భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ చేశారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నరేంద్ర మోదీ పార్టీ(బీజేపీ) అద్భుత విజయాన్ని సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ట్రంప్.. ప్రధానికి శుభాకాంక్షలు చెప్పినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ సోమవారం పేర్కొన్నారు.