నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయిందే’ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ ఎస్‌ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రేమ పెళ్లి విషయంలో అతడు పోలీసుల ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. కాగా విజయ్ కుమార్ ఈ నెల 1వ తేదీన ప్రసూన అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి విజయ్ కుటుంబంతో పాటు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.