ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు పక్కా | CM KCR clarifies on Muslim reservation bill | Sakshi
Sakshi News home page

Jan 18 2017 4:03 PM | Updated on Mar 21 2024 6:45 PM

దేశంలో ఐదోవంతు జనాభా అయిన ముస్లింలు ఎస్సీ, ఎస్టీల కన్నా వెనుకబాటులో ఉన్నారన్న సుధీర్‌ కమిషన్‌ నివేదిక నూటికి నూరుపాళ్లు వాస్తవమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒక్క సుధీర్‌ కమిషనేకాదు, ఇప్పటివరకు ఏర్పాటయిన అన్ని కమిషన్లు ముస్లింల దుర్భరస్థితిపై కళ్లుచెదిరే నివేదికలు ఇచ్చాయని గుర్తుచేశారు. స్వాతంత్ర భారత చరిత్రలో మునుపెన్నడూలేని విధంగా ముస్లింల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని తెలిపారు. బుధవారం శాసనసభలో మైనారిటీ సంక్షేమంపై జరిగిన చర్చలో మాట్లాడిన సీఎం.. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోనే 'ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు' బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ముస్లింల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సభకు వివరించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement