ఓటుకు కోట్లు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఉన్నవారి సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా ఏసీబీ అధికారులు టీడీపీ నేత ప్రదీప్కు ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందించారు. 160సీఆర్పీసీ కింద ప్రదీప్కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో సీఆర్పీసీ కింద టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి, ఇద్దరు డ్రైవర్లకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే విచారించారు. విచారణ జరిగిన వెంటనే టీడీపీ నేత ప్రదీప్కు నోటీసులు జారీ చేయడం మరోసారి ఓటుకు నోటుకు కేసు చర్చనీయాంశంగా నిలిచింది.
Jul 19 2015 11:17 AM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement