ఓటుకు కోట్లు కేసులో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డికి ఏసీబీ బుధవారం నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని 160 సీఆర్ పీసీ కింద నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహ, సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్, జిమ్మిబాబు, తదితరులను ఏసీబీ విచారించింది.