ఈ బాలుడికి ప్రపంచమే పాదాక్రాంతం | A 13-year-old wheelchair-bound musical prodigy of Indian origin is a motivational star | Sakshi
Sakshi News home page

Jun 1 2017 4:10 PM | Updated on Mar 20 2024 3:50 PM

అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతానానికి చెందిన స్పార్ష్‌ షా అనే 13 ఏళ్ల బాలుడు ఇప్పుడు సంచలనాలకే సంచలనమయ్యారు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఈ బాలుడి మాటలు, పాటలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈయన మాటలు నిస్తేజులకు కూడా స్ఫూర్తినిస్తుంటే, పాటలు అభిరుచి లేనివారికి కూడా మాధుర్యాన్ని పంచుతున్నాయి.శరీరంలో 35 చోట్ల ఎముకలు విరిగి పుట్టిన ఈ బాలుడికి ఇప్పటి వరకు శరీరంలో 140 చోట్ల ఎముకలు విరిగాయి. ‘ఆస్టియోజెనెసిస్‌ ఇంపర్‌ఫెక్టా’ అనే అరుదైన జబ్బుతో జన్మించిన ఈ బాలుడు మున్ముందు తన శరీరంలో ఎన్ని ఎముకలు విరుగుతాయో ఆ దేవుడికే తెలయాలంటున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement