పాత పెద్ద నోట్లు రద్దు చేసి బుధవారానికి సరిగ్గా 50 రోజులవుతుంది. ఇన్ని రోజులైనా ప్రజల కరెన్సీ కష్టాలు ఏ మాత్రమూ తీరడం లేదు. 50 రోజుల గడువివ్వండి.. నగదు కష్టాలు పూర్తిగా తగ్గిస్తానంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరిన సమయం కూడా నేటితో ముగియనుంది. కష్టాలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ బ్యాంకులు, ఏటీఎంల వద్ద రోజంతా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.