ఆన్‌లైన్ అమ్మకాల్లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు గట్టిపోటీనిస్తూవచ్చిన స్నాప్‌డీల్ ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇటు నిధుల ప్రవాహం మందగించడం, అటు నష్టాలు పెరుగుతుండటం వంటి అంశాలతో కంపెనీ కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాధాన్యేతర కార్యకలాపాల నుంచి తప్పుకోవాలని, వ్యయాలు భారీగా తగ్గించుకోవాలని సంస్థ నిర్ణయించింది.