కడప అర్బన్ : వైఎస్సార్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’(పిజిఆర్‌ఎస్) ’కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుని ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై మొత్తం 127 ఫిర్యాదులను సమర్పించారు. ఫిర్యాదులపై చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్, కడప ఇన్‌చార్జి డీఎస్పీ బాలస్వామి రెడ్డిచ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్


