ఇటీవలి కాలంలో మైనర్ల డ్రైవింగ్‌లపై వారి తల్లిదండ్రులను, సంరక్షకులను పిలిచి కౌన్సెలింగ్‌ను నిర్వహించాం. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో కడప డిఎస్పీ ఈ. బాలస్వామిరెడ్డి పర్యవేక్షణలో బైకర్లు, స్టంట్ మాస్టర్‌లపై చర్యలకు శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు, మైనర్ల డ్రైవింగ్, బైక్ రేసింగ్, స్టంట్స్‌పై నిరంతర నిఘాను కొనసాగిస్తాం. బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే స్టంట్స్‌కు పాల్పడే మైనర్లు, వారి తల్లిదండ్రులు, బంధువులపై, స్టంట్ మాస్టర్లపై చట్టపరంగా చర్యలను తీసుకుంటాం. – మర్రి తులసీరామ్, ఇన్‌స్పెక్టర్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, కడప


