లడ్డూ విషయమై గొడవ | - | Sakshi
Sakshi News home page

లడ్డూ విషయమై గొడవ

Sep 18 2026 1:39 AM | Updated on Sep 18 2026 1:39 AM

వృద్ధురాలికి తీవ్ర గాయాలు

కమిటీ మెంబర్‌పై చేయి చేసుకోన్న పోలీసులు

అవమానంగా భావించి ఆత్మహత్యాయత్నం

మైలవరం : మండలపరిధిలోని బుచ్చంపల్లె గ్రామంలో బుధవారం కూటమి నేతల మధ్య గొడవ జరిగింది. స్థానికుల కథనం మేరకు బుచ్చంపల్లె గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామంలో 3 విగ్రహలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇందులో ఒక విగ్రహానికి సంబంధించి గ్రామం నడిబొడ్డులో కూటమి నేతల అంతర్గత పోరు వల్ల పండుగలో ప్రశాతంత లేకుండా పోయింది. బుధవారం సాయంత్రం వినాయకుడిని విగ్రహం వద్ద లడ్డూను వేలం వేసేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు.అయితే అనుకున్న విధంగానే లడ్డూను కూటమికి చెందిన ఒక వ్యక్తి రూ.51 వేలకు దక్కించుకున్నాడు. కాగా ఆ కూటమికి చెందిన వ్యక్తిని కమిటీ సభ్యులు డబ్బులు అడిగారు. కమిటీలో కూటమికి చెందిన మరోవ్యక్తి కూడా ఉన్నాడు. వేలం పాటలో దక్కించుకున్న లడ్డూ డబ్బులు కట్టనని వెనక్కి తిరగడంతో కమిటీలో ఉన్న మరో కూటమి మెంబర్‌ డబ్బు కట్టాల్సిందేనని నిలదీయడంతో మాట మాట పెరిగి పెద్ద గొడవగా మారింది. ఇందులో తలారి వెంకటమ్మ అనే వృద్ధురాలికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు ఆమెను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా. వయస్సు ఎక్కువగా ఉందని తాము ఏమి చేయలేమని వెనక్కి పంపినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా గ్రామంలో గొడవ జరగడంతో మైలవరం పోలీసులు గురువారం ఆరుగురు కమిటీ మెంబర్లను స్టేషన్‌కు పిలిపించారు. అందులో రాజమోహన్‌పై పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో అవమానంగా భావించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బఽంధవులు ప్రొద్దుటూరు ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement