విశ్వకర్మకు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

విశ్వకర్మకు ఘన నివాళి

Sep 18 2026 1:39 AM | Updated on Sep 18 2026 1:39 AM

కడప కార్పొరేషన్‌ : కడపలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గురువారం శ్రీ విశ్వకర్మ జయంతి నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సీపీ విశ్వబ్రాహ్మణ విభాగం జిల్లా అధ్యక్షురాలు వి. నారాయణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి విశ్వబ్రాహ్మణులు, కంసాలులు, శిల్పులు, కార్పెంటర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టి, నిర్మాణం, శిల్పకళకు ప్రతీకగా శ్రీ విశ్వకర్మను కొలుస్తామని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో విశ్వకర్మ వర్గాల సంప్రదాయ వృత్తులు, నైపుణ్యాలు ఎంతో కీలకమని తెలిపారు. విశ్వకర్మ వర్గాల విజ్ఞప్తిని గుర్తించి ప్రభుత్వపరంగా విశ్వకర్మ జయంతి నిర్వహణకు గతంలో జీవో జారీ చేసిన ఘనత వైఎస్‌ జగన్‌కు దక్కుతుందని ఆయా నేతలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement