పులివెందుల : స్థానిక గుంతబజార్ సమీపంలో ప్రతిష్టించిన వినాయకుడి నిమజ్జనం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ట్రాక్టర్‌పై వెళుతుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన యువకులను వెంటనే స్థానిక గంగిరెడ్డి సార్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని, భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు హాల్ గంగాధర్ రెడ్డి, కోడి రమణ, నూరుల్లా, కనక పాల్గొన్నారు.


