చేతిలో పారతో సిమెంట్ కంకర కలుపుతున్న ఇతని పేరు సుబాన్. చెన్నూరు మండలం కొండపేట వాసి. పేద కుటుంబానికి చెందిన సుభాన్ కష్టపడి చదువుకున్నాడు. బీఈడీ పూర్తి చేశాడు. కష్టపడి డీఎస్సీ కోసం ప్రయత్నం చేశాడు. కానీ అదృష్టం లేకో.. ప్రభుత్వం మాయాజాలమో కానీ గత డీఎస్సిలో 64మార్కులు వచ్చాయి. ఎల్జిబుల్‌కు కొన్ని మార్కుల దూరంలో ఆగిపోయాడు. తన కష్టాన్ని నమ్ముకొన్న సుభాన్ ఇదిగో ఇలా భవన నిర్మాణకూలిగా మారి జీవనం సాగిస్తున్నాడు.నిరుద్యోగ యువత కోసం 3 వేలు నిరు ద్యోగ భృతి ఇస్తామన్నారు.. మరి అది ఏమైందో, ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదని వాపోయాడు.
– మొహమ్మద్ రఫీ, ఫోటోగ్రాఫర్,కడప.


