ప్రొద్దుటూరు క్రైం: అందరి సహకారంతో ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేద్దామని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వేంపల్లి భాస్కర్ పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం ఏఆర్టీ, ఎన్‌జీఓల కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ’న్యాకో’ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. హైరిస్క్ గ్రూపులతో పాటు అనుమానం ఉన్న వారందరికీ హెచ్‌ఐవీ పరీక్షలు చేయాలని, వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ సూర్యనాగలక్ష్మి, ఆసిఫ్, టీబీ విభాగం సిబ్బంది, ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు.


