కడప మీదుగా మరొక వారాంతపు రైలు | - | Sakshi
Sakshi News home page

కడప మీదుగా మరొక వారాంతపు రైలు

May 23 2026 1:58 AM | Updated on May 23 2026 1:58 AM

కడప మీదుగా మరొక వారాంతపు రైలు

కడప కోటిరెడ్డిసర్కిల్‌: తిరుపతి–చర్లపల్లి–తిరుపతి (17441/42) లైన్‌లో మరో వారాంతపు రెగ్యులర్‌ రైలును నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ తెలిపారు. తిరుపతిలో ప్రతి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, నంద్యాల, దిగువమిట్ట, గిద్దలూరు, కంభం, మార్కా పురం రోడ్డు, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి మీదుగా చర్లపల్లికి మరుసటి రోజు ఉదయం 8.00 గంటలకు చేరుతుందన్నారు. అలాగే ప్రతి బుధవారం చర్లపల్లిలో రాత్రి 9.30 గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతికి చేరుతుందని వివరించారు. ఈనెల 26 నుంచి ఈ వారాంతపు రైలు ప్రారంభమవుతుందని తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement