గుర్తుతెలియని వాహనం ఢీ | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీ

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

– యువకుడు దుర్మరణం

మదనపల్లె టౌన్‌: హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడి కక్కడే దుర్మరణం చెందిన విషాదకర సంఘటన శుక్రవారం వేకువజామున మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. మదనపల్లె తాలూకా పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, అబ్బగొంది గ్రామానికి చెందిన ఎరప్ప్ర నాయుడు కుమారుడు ఏ. శ్రీరాములు నాయుడు (35) శుక్రవారం తెల్లవారుజామున పాలెంకొండలో కూలీల కోసం వైపు హైవేపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. సీటీఎం చెరువు సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం శ్రీరాములు నాయుడును బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

హోరాహోరీగా సీపీఎల్‌ –2

వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్‌సీఎస్‌ క్రీడామైదానంలో సీపీఎల్‌ –2 క్రికెట్‌ మ్యాచ్‌లు హోరాహోరీగా జరుగుతున్నాయి. శుక్రవారం హైపెరియన్‌, ఎన్‌కే స్పోర్ట్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎన్‌కే స్పోర్ట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లుకు 186 పరుగులు చేసింది. హైపెరియన్‌ ప్లేయర్‌ సల్మాన్‌ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌ దిగిన హై పెరియన్‌ జట్టు 18.3 ఓవర్లకు 4 వికెట్ల తేడాతో 191 పరుగులు చేసి విజయం సాధించింది. సోహన్‌ రెడ్డి 45 బంతుల్లో 83, జయంత్‌ రెడ్డి 23 బంతుల్లో 53 పరుగులు చేశారు. సోహన్‌రెడ్డికి మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు, ట్రోఫీని స్థానిక ఎంపీడీవో మనోహర రాజు, పంచాయతీ ఈవో రవీంద్రనాథ్‌ అందించారు. మధ్యాహ్నం స్పార్టన్‌ వారియర్స్‌, ఆదిత్య బీఆర్‌ జట్ల మధ్య జరిగి మ్యాచ్‌ను స్థానిక ఎస్‌ఐ తిప్పేస్వామి టాస్‌ వేసి ప్రారంభించారు. ఆదిత్య బిఆర్‌ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. జట్టులో రెడ్డిరుషీల్‌ 59 బంతుల్లో 95 పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచాడు. 215 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన స్పార్టన్‌ వారియర్స్‌ 18.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటయింది.ఈ కార్యక్రమంలో సునీల్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement