ఇన్‌చార్జి పాలనతో ప్రజల అవస్థలు
జమ్మలమడుగు: రెవెన్యూ శాఖలో బదిలీలు, పోస్టింగుల వ్యవహారం జమ్మలమడుగు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జమ్మలమడుగు ఆర్‌డీఓగా బాధ్యతలు దక్కించుకోవాలంటే ప్రభుత్వ పెద్దలకు అక్షరాలా 40 లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సిందేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అంత భారీ మొత్తం చెల్లించి ఇక్కడికి వచ్చినా, పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందా? లేదా? అనే ఆలోచనతో అధికారులు ఈ పోస్టింగ్‌కు వెనకడుగు వేస్తున్నారు.
అంతా పాతవారు దోచుకున్నారు.. !
గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు స్థానిక కంపెనీలు, పరిశ్రమల నుంచి భారీగా వసూళ్లు చేసుకుని వెళ్లిపోయారని, ఇప్పుడు వచ్చే కొత్త అధికారులకు అక్కడ దక్కేదేమీ ఉండదనే గుసగుసలు రెవెన్యూ శాఖలోనే బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు గతంలో జమ్మలమడుగు డివిజన్ పరిధిలో 16 మండలాలు ఉండగా, ప్రస్తుతం పులివెందుల విడిగా డివిజన్ కావడంతో జమ్మలమడుగు కేవలం 10 మండలాలకే పరిమితమైపోయింది. ల్యాండ్ కన్వర్షన్ (భూ మార్పిడి) రాబడి కూడా పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి మారడంతో ఆర్‌డీఓ కార్యాలయానికి వచ్చే సొంత ఆదాయం పూర్తి గా నిలిచిపోయింది. స్టీల్‌ప్లాంట్, సోలార్ కంపెనీల నిర్వాహకులు సైతం ఏ చిన్న పని ఉన్నా డైరెక్ట్‌గా ప్రభుత్వ పెద్దల వద్దకే వెళ్తుండటంతో తమకెలాంటి ఎలాంటి ప్రతిఫలం ఉండదని అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది.
పోస్టింగ్‌ల పైరవీలు..
15 ÆøkÌS MìS…§ýlr Ð]l¬§ýlª-¯]l*Æý‡$ G‹Ü-yîlïÜ M>Æ>Å-ÌS-Ķæ$…ÌZ ç³°-^ólíܯ]l K A«¨M>Ç fÐ]l$Ã-ÌS-Ð]l$yýl$VýS$ BÆŠ‡yîl-KV> Ð]lÝë¢Æý‡° ÑçÜ–¢™èl {ç³^éÆý‡… fÇ-W…-¨. M>± _Ð]lÇ °Ñ$çÙ…ÌZ BĶæ$-¯]l¯]l$ ¯ðlË*ÏÆý‡$ {´ë…™é-°MìS º¨Î ^ólÔ>Æý‡$. {ç³çÜ$¢™èl… CMýSPyól VýS™èl…ÌZ ™èlçßæ-ïÜ-Ìêª-ÆŠ‡V> Ñ«§ýl$Ë$ °Æý‡Óíßæ…_, C糚yýl$ MýSÆý‡*²Ë$ hÌêÏÌZ ç³°-^ólçÜ$¢¯]l² JMýS A«¨M>Ç fÐ]l$ÃÌS-Ð]l$-yýl$-VýS$MýS$ Æ>Ð]l-yé-°MìS ¡{Ð]l {ç³Ä¶æ$-™é²Ë$ ^ólçÜ$¢-¯é²Æý‡$. AƇ$$™ól, {糿¶æ$™èlÓ ò³§ýlªË$ Ayýl$-VýS$-™èl$¯]l² ₹40 ÌS„ýSÌS ¿êÈ Ððl¬™é¢°² C^èl$a-Mø-Ð]l-yé-°MìS BĶæ$¯]l Cº¾…¨ ç³yýl$-™èl$-¯]l²r$Ï çÜÐ]l*-^é-Æý‡…. C¨Ìê E…yýlV>, fÐ]l$Ã-ÌS-Ð]l$yýl$-VýS$ÌZ çÜÇ-Mö™èl¢ ÝëÐ]l*-hMýS çÜÒ$-MýS-Æý‡-×êÌS {ç³^éÆý‡… ™ðlÆý‡-Oò³MìS Ð]l_a…¨. Ý린MýS GÐðl$ÃÌôæÅ Æð‡yìlz ÝëÐ]l*hMýS Ð]lÆ>Y-°MìS ^ðl…¨¯]l ÐéÆý‡$ M>Ð]lyýl…™ø, CMýSPyýl BÆŠ‡yîlK ´ùçÜ$tÌZ Æð‡yìlz ÝëÐ]l*-hMýS Ð]lÆ>Y-°MìS ^ðl…¨¯]l Ðéǰ °Ä¶æ$Ñ$…-^èlÐ]l-§ýlª-°, Ð]l$Æö-MýS-ǰ ¡çÜ$-MýS$Æ>-ÐéÌS° {糿¶æ$™èlÓ ò³§ýlªË$ ¿êÑçÜ$¢-¯]l²r$Ï ´÷Ísìæ-MýSÌŒæ çÜÇP-ÌŒæÞÌZ sêMŠS ¯]lyýl$-Ýù¢…¨.
ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న వ్యక్తికే జమ్మలమడుగు ఆర్‌డీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్రతిరోజూ కడప నుంచి ఇక్కడికి వస్తూ పోతుండటంతో పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నా రు. ఫలితంగా డివిజన్ పరిధిలోని భూవివాదాలు, పెండింగ్ అర్జీల పరిష్కారం నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వ పెద్దలు కక్షసాధింపులు, బేరసారాలు పక్కనబెట్టి సాధ్యమైనంత త్వరగా రెగ్యులర్ ఆర్‌డీఓను నియమిస్తేనే తమ భూసమస్యలు పరిష్కారమవుతాయని, లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జమ్మలమడుగు ఆర్డీవో పోస్టింగ్ కావాలా..రూ.40 లక్షలు ఇచ్చుకోండి!
సామాజిక సమీకరణాల మెలిక
మూడు నెలలుగా ఇన్‌చార్జిలపాలనలోనే పరిపాలన
నలిగిపోతున్న సామాన్యుడు


