కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లి మెంటరీ పరీక్షలు గురువారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఉదయం సెషన్‌లో 46 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన పరీక్షలకు జనరల్ విభాగంలో 2976 మందికి 2813 మంది హాజరయ్యారు. సెకండియర్‌కు సంబంధించి మధ్యాహ్న సెషన్‌లో నిర్వహించిన పరీక్షలకు జనరల్ విభాగంలో 1682 మందికిగాను 1565 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌ఐవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా మా ల్ ప్రాక్టీస్ కేసును నమోదు కాలేదని తెలిపారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి–చర్లపల్లి–తిరు పతి (17443/44) మధ్య వారాంతపు రెగ్యులర్ రైలును నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28 నుంచి ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు తిరుపతిలో బయలుదేరి రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, నంద్యాల, మార్కాపురంరోడ్డు, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా చర్లపల్లికి మరుసటిరోజు ఉదయం 8.25 గంటలకు చేరుతుందన్నారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి ఇదే మార్గంలో మరుసటిరోజు ఉదయం 7.30 గంటలకు తిరుపతికి చేరుతుందని వివరించారు.
కడప అర్బన్: కడపలోని రిమ్స్ పీఎస్ పరిధిలో ఏప్రిల్ 6న దారుణంగా హత్యకు గురైన కలమల్ల పెద్ద దస్తగిరి (53) కేసులో నేరారోపణలను ఎదుర్కొంటున్న మాజీ మేయర్ బండి నిత్యానందరెడ్డిని రెండు రోజుల క్రితం కస్టడికి తీసుకున్నారు. గురువారం కస్టడీ గడువు ముగియడంతో ఆయనకు పోలీసులు రిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత కడపలోని జిల్లా కోర్టులో మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బండి నిత్యానందరెడ్డిని తిరిగి కడప కేంద్ర కారాగారానికి రిమాండ్‌కు తరలించారు.
కడప సెవెన్‌రోడ్స్: భరణం చెల్లించకపోవడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ బోడా సుబ్బయ్యకు నెల రో జుల జైలు శిక్ష విధిస్తూ కడప ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసనాయక్ గురువారం తీర్పు వెలువరించారు. కడప నగరానికి చెందిన బోడా సుబ్బయ్య గంగాదేవి అనే మహిళను వివా హం చేసుకున్నాడు. మనస్పర్థలు రావడంతో ఆయన గంగాదేవిని వదిలేశాడు. దీంతో గంగా దేవి కడప ఫ్యామిలీ కోర్టులో ఎంసీ నంబరు 58/ 2022 కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆమె జీవనం కోసం నెలకు రూ. 15 వేలు చెల్లించాలంటూ గత ఏడాది మార్చి 5వ తేదీ కోర్టు తీర్పునిచ్చింది. అయితే, బోడా సుబ్బయ్య భరణం చెల్లించకపోవడంతో తనకు రావాల్సిన రూ. 4 లక్షల 35 వేలు అరియర్స్ ఇప్పించాలంటూ గంగాదేవి ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. న్యాయమూర్తి దీనిపై విచారణ నిర్వహించి బోడా సుబ్బయ్యను నెల రోజులు జైలుకు పంపారు.
వేంపల్లె: జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ అభివృద్ధికి ప్రభుత్వం రూ.6కోట్ల నిధులు మంజూరు చేసిందని డీఎఫ్‌ఓ వినీత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం వేంపల్లెలోని అటవీ క్షేత్ర కార్యాలయంలో రూ.23లక్షల ఫారెస్ట్ నిధులతో నిర్మించిన అటవీ క్షేత్రాధికారి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలను నా టారు. ఈ సందర్భంగా ఆయన మీడి యాతో మాట్లాడుతూ ఎర్రచందన రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు. ఫారెస్ట్‌లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. నెమళ్ల పునరుత్పత్తి కేంద్రంలో నెమళ్ల సంరక్షణ కోసం ఈ ఏడాది రూ.15 లక్షలు ఖర్చు చేసి కంచె, సీసీ కెమెరాల ఏర్పాటుతోపా టు ఇతర పనులు చేపట్టామన్నారు. వేంపల్లె ఫారె స్ట్ రేంజ్ అధికారి బాల సుబ్రమణ్యం, డీఆర్‌ఓ వెంకట సుబ్బయ్య, సిబ్బంది పాల్గొన్నారు.


