వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా బండి మునిరెడ్డి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా బండి మునిరెడ్డి

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా బండి మునిరెడ్డి 26 నుంచి కౌన్సెలింగ్‌ కల్యాణం.. కమనీయం

కడప కార్పొరేషన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా కడప నగరం రూకవారిపల్లెకు చెందిన బండి మునిరెడ్డి నియ మితులయ్యారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన ఈయన నగర ప్రజలకు సుపరిచితుడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బండి మునిరెడ్డి మాట్లాడుతూ తనను రాష్ట్ర మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా నియమించిన పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.

కడప ఎడ్యుకేషన్‌: వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాలో ని డాక్టర్‌. బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల్లో ప్రవేశా లకు ప్రవేశ పరీక్ష రాసి ఇప్పటివరకు సీటు కేటాయింపు పొందని విద్యార్థులకు ఈ నెల 26వ తేదీ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు డా. బీఆర్‌ అంబేద్కర్‌ గురుకులాల జిల్లా సమన్వయకర్త ఉదయశ్రీ తెలిపారు. ఇందులో 5వ తరగతి ప్రవేశాలకు బాలికలకు 26వ తేదీ ఉదయం 10 గంటలకు, బాలురకు 27వ తేదీ ఉదయం 10 గంటలకు కడప చిన్నచౌక్‌లోని డా. బిఆర్‌ అంబేద్కర్‌ గురకులంలో కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు బాలికలకు 29వ తేదీ ఉదయం 10 గంటలకు, బాలురకు 30వ తేదీ ఉదయం 10 గంటలకు కడప చిన్నచౌక్‌లోని డా. బీఆర్‌ అంబేద్కర్‌ గురుకులంలో కౌన్సిలింగ్‌ ఉంటుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.

వాల్మీకిపురం: వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామాలయంలో గురువారం శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉద యం స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి అర్చన, అభిషేకం జరిపారు. తదితర అనంతరం ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలోని ఆస్థాన మండపంలో సాంప్రదాయ బద్ధంగా తీసుకెళ్లి ఆశీనులను చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణం నిర్వహించారు. సాయంత్రం తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement