గండికోట ప్రాజెక్టు కింద ఫేస్–3లో మా గ్రామం ముంపులోకి పోయింది. మా గ్రామానికి మొత్తానికి 600 పైగా ఉండగా 23 మందికి మాత్రమే పరిహారం చెల్లించారు. మిగిలిన వారికి పరిహారం రాక అష్టకష్టాలు పడుతున్నాం. పరిహారం ఇచ్చి మా గ్రామ నిర్వాసితులను ఆదుకోవాలని కోరుతున్నాం.
–జి.నారాయణరెడ్డి, నిర్వాసితుడు,
పి.అనంతపురం గ్రామం
ప్రాథమిక పాఠశాలలు రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు
గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురైన తాళ్ల ప్రొద్దుటూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో భవనాలు లేక రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. పాలకులు చొరవ చూపి భవనాలు నిర్మించాలి. గ్రామంలో తాగునీళ్లు లేక ఇక్కట్లు పడుతున్నాం. డ్రైనేజీ సిమెంట్ రోడ్లు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలి. –భూమిరెడ్డి ప్రతాపరెడ్డి, తాళ్ల ప్రొద్దుటూరు
భూములు అమ్ముకోలేం.. ప్రభుత్వం పరిహారం ఇవ్వదు
కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వస్తే పరిహారం 24 లక్షలు ఇస్తామంటూ యువగళంలో నారాలోకేష్ రాజోళి ముంపురైతులతో సమావేశం పెట్టి మరీ చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. ఇప్పటివరకు భూములకు పరిహారం గాని రాజోళి నిర్మాణం గురించి ప్రస్తావనే లేదు. మా భూములకు ప్రభు త్వం అవార్డులు పాస్ చేసింది. మా అవసరాలకు భూములు అమ్ముకుందామంటే రిజిష్ట్రేషన్లు కావడంలేదు. ప్రభుత్వమేమో పరిహారం ఇవ్వడంలేదు. ఇలాగైతా మేమెలా బతకాలి.
–విశ్వనాథరెడ్డి, చదిపిరాళ్లదిన్నె,
రాజోళి ముంపు బాధితులు


