సర్వులూ ఖుషీ! | - | Sakshi
Sakshi News home page

సర్వులూ ఖుషీ!

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

మెకానిక్‌ ‘రెడ్డి’..ఐకానిక్‌ ‘బాషా’

స్వయంకృషి..

పీలేరు: ఆయన చదివింది ఐటీఐ డీజిల్‌ మెకానిక్‌ కోర్సు.. నడిపేది సాధారణ మెకానిక్‌ షెడ్డు. కానీ ఆయన మదిలో మెదిలిన ఆలోచనలు మాత్రం అసాధారణ ఆవిష్కరణలకు దారితీశాయి. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం కాకులారంపల్లెకు చెందిన మహ్మద్‌వలి, షర్మిల కుమారుడు రెడ్డిబాషా తన స్వయంకృషితో సరికొత్త ప్రయోగాలు చేస్తూ అందరితో ‘శభాష్‌’ అనిపించుకుంటున్నాడు. పీలేరులోని చిత్తూరు రోడ్డులో మెకానిక్‌ షెడ్డు నడుపుకునే రెడ్డిబాషా, కేవలం రిపేర్లకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే వాహనాల తయారీపై దృష్టి పెట్టాడు.

రైతులు, దివ్యాంగులకు అండగా..

దివ్యాంగులు సులభంగా నడుపుకొనేలా ప్రత్యేకంగా మూడు చక్రాల వాహనాన్ని రూపొందించాడు. అలాగే రైతులు పొలం నుంచి పశుగ్రాసం, వ్యవసాయ పనిముట్లు తెచ్చుకునేందుకు వీలుగా బైక్‌ స్పేర్‌ పార్ట్స్‌తో తక్కువ ఖర్చుతో ఓ సరికొత్త వాహనాన్ని తయారు చేసి విజయం సాధించాడు. బయోగ్యాస్‌తో నడిచేలా సైకిల్‌కు ఇంజిన్‌ అమర్చి భేష్‌ అనిపించుకున్నాడు.

రూ.5 లక్షలతో హెలికాప్టర్‌ కల!

రెడ్డిబాషా మరో అడుగు ముందుకేసి సొంతంగా రూ. 5 లక్షల వ్యయంతో హెలికాప్టర్‌ తయారీకి శ్రీకారం చుట్టాడు. ఏడాదిన్నర కాలంగా శ్రమిస్తూ ఒక్కో స్పేర్‌ పార్ట్‌ను అమర్చుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం క్యాబిన్‌ వర్క్‌ మినహా మిగిలిన పనంతా పూర్తయింది. మరో ఆరు నెలల్లో ఈ హెలికాప్టర్‌ పూర్తిగా సిద్ధమవుతుందని రెడ్డిబాషా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందితే సమాజానికి ఉపయోగపడే మరిన్ని సరికొత్త యంత్రాలను ఆవిష్కరిస్తానని ఈ యువ మెకానిక్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

దివ్యాంగుల కోసం తయారు చేసిన మూడు చక్రాల వాహనం, రైతులకోసం తయారు చేసిన వాహనం

పీలేరు యువకుడి అద్భుత ఆవిష్కరణలు

షెడ్డులో ప్రయోగాలు.. సమాజానికి ఉపయోగాలు!

రైతులు, దివ్యాంగుల కోసం తక్కువ ఖర్చుతో వాహనాల రూపకల్పన.

బయోగ్యాస్‌ సైకిల్‌ నుంచి హెలికాప్టర్‌ దాకా అసాధారణ ప్రయోగాలు.

ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానంటున్న యువకుడు

Advertisement
 
Advertisement
Advertisement