కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగాతొమ్మిది రోజుల నుంచి నిర్వహిస్తున్న ఏపీ ఈఏసీ సెట్ బుధవారంతో ముగిశాయి. ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, పార్మసీ(బైపీసీ)కోర్సుల ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. ఇందులో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌లో పరీక్షలను జరిపారు. ఇందులో భాగంగా చివరి రోజు బుధవారం నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి రెండు సెషన్స్‌లో నిర్వహించిన అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 87.92 శాతం మంది విద్యార్థుల హాజరయ్యారు.
కడప అర్బన్: వైఎస్సార్ కడప జిల్లాలో 19 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఒక ఏఎస్‌ఐ, ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 13 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరందరూ తక్షణమే తమకు కేటాయించిన కొత్త ప్రాంతాల్లో విధుల్లో చేరాలని ఎస్పీ ఆదేశించారు.
కడప అగ్రికల్చర్: జిల్లా కేంద్రమైన కడపలో ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు జరగాల్సిన రైతు పండుగను తాత్కాలికంగా వాయిదా వేశామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశామని తెలిపారు.
కడప సెవెన్‌రోడ్స్: రాజమహేంద్రవరంలో జూన్ 6,7 తేదీల్లో నిర్వహించనున్న 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు కడప నగరానికి చెందిన సాహిత్యకారుడు కడియంపాటి అరుణ్‌ప్రసాద్‌కు ఆహ్వానం అందింది. చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ మహాసభలు జరుగుతున్నట్లు కళావేదిక జాతీయ అధ్యక్షులు జి.ఈశ్వరీ భూషణం, ప్రణాళిక అధికారి డాక్టర్ టి.పార్థసారథి తెలిపారు.
చక్రాయపేట: జిల్లాలోని ప్రముఖ గండి శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో బుధవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణాధికారి పట్టెం గురుప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలోని ఏడు శాశ్వత హుండీల ద్వారా రూ.23,71,689లు, అన్న ప్రసాద వితరణ హుండీ ద్వారా రూ.21,584లు కలిపి మొత్తం ఆలయానికి రూ.23,93,273ల ఆదా యం వచ్చిందని వెల్లడించారు. అలాగే 000.005.900 గ్రాముల మిక్స్‌డ్ బంగారు, 000.420.500 గ్రాముల మిక్స్‌డ్ వెండి వస్తువు లు వచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కడప దేవదాయశాఖ కార్యాలయ పర్యవేక్షకుడు శివయ్య, ఆలయ చైర్మన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్మీడియట్ అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాల ను సిద్ధం చేశారు. ఇందులో మొదటి సంవత్సరానికి సంబంధించి 12,235 మంది విద్యార్థులు కాగా ద్వితీయ సంవత్సరానికి 8,084 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సాగనున్నాయి. ఇందుకు సంబంధించి కడప ఆర్‌ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆన్‌లైన్ స్ట్రీమ్ ద్వా రా పరీక్షల తీరును పర్యవేక్షించనున్నారు. పరీక్షల నిర్వహణ కు సంబంధించి ఏవైనా సమస్యలుంటే 08562– 244171కు పోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆర్‌ఐవో తెలిపారు.


