రాజకీయ కుట్రే! | - | Sakshi
Sakshi News home page

రాజకీయ కుట్రే!

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

రాజకీయ కుట్రే! ●రియల్‌ వ్యాపారంలో ఒప్పించి మెప్పించేవాడు

సాక్షి ప్రతినిధి, కడప: పెద్ద దస్తగిరి హత్య కేసులో తనను ఇరికించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని కడప మాజీ మేయర్‌ బండి నిత్యానందరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపితంతోనే పోలీసులు హత్య కేసుకు వక్రభాష్యం పలికినట్లు వివరించారు. తాజాగా నిత్యానందరెడ్డి పీటీ వారెంట్‌లో అదే విషయం తేటతెల్లమైంది. హతుడు దస్తగిరితో స్నేహితం తప్పా, శతృత్వం లేదని, రియల్‌ ఎస్టేట్‌ లావాదేవిలు అసలే లేవని తేల్చి చెప్పినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు...

దస్తగిరి హత్య కేసులో నిందితుడు నరేంద్ర మాజీ మేయర్‌ బండి నిత్యానందరెడ్డికి సన్నిహితుడు, పైగా డ్రైవర్‌గా కూడా ఉన్నారు. గత నాలుగు నెలలుగా ఇరువురి మధ్య అనేక పర్యాయాలు ఫోన్‌కాల్స్‌ ఉన్నాయి. వాటి ఆధారంగా నిత్యానందరెడ్డి ప్రమేయంపై పోలీసులు అనుమానించారు. ఆ మేరకు కేసు నమోదు చేయడంతో దిక్కుతోచని నిత్యానందరెడ్డి పరారయ్యా రు. పరారీలో ఉంటూనే కోర్టులో ముందస్తు బెయిల్‌ పొందేందుకు ప్రయత్నించారు. బెయిల్‌ దక్కకపోవడంతో ఎస్పీ ఎదుట సరెండర్‌ అయ్యారు. అదే విషయాన్ని రెండురోజులుగా విచారించిన చిన్నచౌక్‌ సీఐ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ బాలస్వామిరెడ్డిలకు తేల్చి చెప్పినట్లు సమాచారం. పోలీసు అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబు ఇచ్చినట్లు తెలుస్తోంది. పెద్ద దస్తగిరితో సన్నిహితం తప్పా, శతృత్వం లేదని, తామంతా వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులమని వివరించినట్లు సమాచారం. పైగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో దస్తగిరి ద్వారా ఎలాంటి లావాదేవీలు లేవని వివరించినట్లు తెలుస్తోంది. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ నిక్కచ్చిగా నిజాయితీగా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆలంఖాన్‌పల్లె దస్తగిరి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో దళారిగా వ్యవహరించేవారు. తన చాతు ర్యం కారణంగా అమ్మకం దారులు, కొనుగోలు దారులను ఒప్పించి, తనకు కొంత వాటా పెట్టుకునేవారు. ఇలా అనేక మందితో వ్యాపార కార్యకలాపాలున్నాయి. ఎక్కడా ఒక్కరితో కూడా వ్యాపార పరంగా విభేదాలు తలెత్తిన సంద ర్భా లు లేవని కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేశారు. రియల్‌ వాప్యారంలో ఒప్పించి, మెప్పించేవారని దస్తగిరితో పరిచయం ఉన్న వారంతా చెబుతున్నారు. మారెమ్మ జాతర వివాదం, చెడు వ్యసనాలు కల్గిన వారి దుశ్చర్యలు కారణంగా తలెత్తిన ఘర్షణ, పరుషపదజాలం ప్రయోగం, ఎవరికి వారు క్షణికావేశంతో రెచ్చిపోవడంతో హత్య చోటుచేసుకుందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణంగా కూడా పలువురు ఆరోపిస్తుండడం విశేషం.

పెద్ద దస్తగిరి హత్యపై పోలీసులకు స్పష్టం చేసిన నిత్యానందరెడ్డి !

రియల్‌ ఎస్టేట్‌లో తనకు ఎలాంటిలావాదేవీలు లేవని తేల్చిచెప్పిన వైనం

దస్తగిరితో స్నేహితం తప్ప, శతృత్వం లేదని స్పష్టీకరణ

Advertisement
 
Advertisement
Advertisement