ఎంపికల్లో టెస్ట్‌లు ఇవే...
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: జిల్లా కేంద్రమైన కడప నగరంలోని క్రీడా పాఠశాలలో 2026–27 ప్రవేశాలకు అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లా బిడ్డలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్న సదాశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా కేంద్రమైన కడప నగర శివార్లలోని స్పోర్ట్స్ స్కూల్ నిర్మించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్పోర్ట్స్ స్కూల్లో చదివిన విద్యార్థులు వివిధ క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న క్రీడాకారులు ఎంతో మంది క్రీడల్లో ప్రతిభ చాటి ఉన్నతస్థాయికి వెళ్లారు. కాగా 2026–27 విద్యా సంవత్సరానికి 4,5,6 తరగతుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
జూన్ 2 తేదీ వరకు గడువు
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను మే 19 నుంచి జూన్ 2 లోపల దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 75 సీట్లకు గాను 4వ తరగతిలో 40 సీట్లు ఉన్నాయి. బాలురు–20, బాలికలు–20, 5వ తరగతిలో మొత్తం 23 సీట్లకు గాను బాలురు–06, బాలికలు –17 మంది, 6 తరగతిలో12 సీట్లకు గాను బాలురు 4, బాలికలు 8 క్రీడా పాఠశాలకు తీసుకుంటారు. 4వ తరగతి ప్రవేశానికి మూడవ తరగతి పూర్తి చేసి 8 నుంచి 10 ఏళ్లలోపు ఉండాలి. 5వ తరగతి అభ్యర్దులు 4వ తరగతి పూర్తి చేసి 9 నుంచి 11 ఏళ్లలోపు ఉండాలి. ఇక 6 తరగతిలో ప్రవేశానికి 5 తరగతి పూర్తి చేసి 10 నుంచి 12 మధ్య ఉండాలి.
ఎంపికలు జరిగే తేదీ
జిల్లాస్థాయి ఎంపికలు జూన్ 7, 8 తేదీల్లో కడప డీఎస్‌ఎ స్టేడియంలో చేపట్టనున్నారు. జూన్9న జిల్లా స్థాయిలో ఎంపికై న జాబితాను విడుదల చేస్తారు. జూన్ 11న ఎంపికై న విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలకు సమాచారం అందిస్తారు. జూన్ 14,15 తేదీల్లో కడపలోని డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయి.
క్రీడా పాఠశాల ఎంపికలకు 9 రకాల టెస్ట్‌లను నిర్వహించనున్నారు. ఇందులో ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్ , స్టాండింగ్ బ్రాండ్ జంప్, వర్టికల్ జంప్, మెడిసిన్ త్రోబాల్, 800 మీటర్ల పరుగు పందెంతో పాటు వివిధ టెస్ట్‌లు నిర్వహిస్తారు.
జూన్ 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు
జూన్ 7, 8 తేదీల్లో జిల్లా స్థాయి ఎంపికలు


