కొండాపురం/ముద్దనూరు: జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండల పరిధిలోని టి. కోడూరు గ్రామం వద్ద సెయిల్ సోలార్ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవానికి ఈ నెల 22న రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పి షెల్కేనచికేత్ విశ్వనాఽథ్ పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సెల్ సోలార్‌సంస్థ వద్ద జరుగుతున్న పనులను పూర్తి చేసి ప్పారంభోత్సవానికి సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రకృతి సేద్య సాగుపై..
ప్రకృతిసేద్యంతో సాగుచేస్తున్న వ్యవసాయభూమిని కలెక్టర్ శ్రీధర్ ,జేసీ నిధిమీనా, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ బుధవారం పరిశీలించారు.ముద్దనూరు మండలంలోని పెనికలపాడు గ్రామ సచివాలయ పరిధిలో రమణారెడ్డి అనే రైతు ప్రకృతి సేద్యంతో మామిడి,చీనీ తదితర పంటలను సాగుచేస్తున్నారు. రైతులతో ముఖాముఖిలో భాగంగా మంత్రి లోకేష్ ఈ సాగును పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.


