క్రికెట్‌ బుకీ వదిలివేతపై ఏఎస్పీ విచారణ పూర్తి | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బుకీ వదిలివేతపై ఏఎస్పీ విచారణ పూర్తి

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

క్రికెట్‌ బుకీ వదిలివేతపై ఏఎస్పీ విచారణ పూర్తి

ప్రొద్దుటూరు క్రైం: వేంపల్లె క్రికెట్‌ బుకీ వదిలివేత వ్యవహారంపై ఏఎస్పీ విభూకృష్ణ జరిపిన అంతర్గత విచారణలో కీలక వాస్తవాలు వెలుగుచూశాయి. ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ ఆదేశాల మేరకు ఏఎస్పీ స్వయంగా స్టేషన్‌కు వెళ్లి, ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ, ఎస్‌ఐలను సుదీర్ఘంగా ప్రశ్నించారు.

విచారణలో తేలిన ముఖ్యాంశాలు:

ఏఎస్పీకి సమాచారం లేకుండానే ఎస్‌ఐ, ఒక కానిస్టేబుల్‌ వేంపల్లెకు వెళ్లి క్రికెట్‌ బుకీని ప్రొద్దుటూరుకు తరలించినట్లు నిర్ధారణ అయింది. స్టేషన్‌కు వచ్చిన ఒక మధ్యవర్తి.. పోలీసు అధికారులతో మాట్లాడి, ఎలాంటి కేసు లేకుండా బుకీని విడిపించుకు వెళ్లిన విషయం వాస్తవమేనని తేలింది. ఈ వ్యవహారంలో బుకీ ఎంత మొత్తం ముట్టజెప్పాడు, మధ్యవర్తితో ఎవరెవరు మాట్లాడారు అనే కోణంలో ఏఎస్పీ లోతుగా ఆరా తీశారు. సీఐ ఆదేశాలతోనే ఎస్‌ఐ వేంపల్లె వెళ్లాడా, లేక సొంత నిర్ణయంతో వెళ్లాడా అనే దానిపై వివరాలు సేకరించారు. నివేదికను ఎస్పీకి సమర్పించినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement