నిన్న సీజ్‌... నేడు గలీజ్‌ | - | Sakshi
Sakshi News home page

నిన్న సీజ్‌... నేడు గలీజ్‌

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

లీజు ముగిసినా, అద్దె కట్టకుండా

అధికార బలంతో బెదిరింపులు

సీజ్‌ చేసిన మున్సిపల్‌ షాపుల

తాళాలు పగులగొట్టిన టీడీపీ నేత!

రాజంపేట : రాజంపేట పురపాలక సంఘం కూరగాయల మార్కెట్‌లో అధికారులు సీజ్‌ చేసిన షాపులు అధికార తెలుగుదేశం పార్టీ నేతవి కావడంతో మున్సిపల్‌ గలీజు దందా పట్టణంలో తీవ్ర సంచలనంగా మారింది. మార్కెట్‌లో వ్యాపారం చేసుకుంటున్న సదరు నేత.. ఏళ్ల తరబడి షాపులకు అద్దె చెల్లించకుండా, గడువు ముగిసినా లీజు రిన్యూవల్‌ చేసుకోకుండా నిబంధనలను ఉల్లంఘించారు. అధికారులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ, తాను అధికార పార్టీ నాయకుడినంటూ అధికారులపై తీవ్ర రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ మున్సిపల్‌ అధికారులు వెనక్కి తగ్గకుండా మంగళవారం పోలీసు బందోబస్తుతో ఆ నాలుగు షాపులను సీజ్‌ చేశారు.

ఏపీ మున్సిపాలిటీ చట్టం ప్రకారం తీవ్ర నేరం!

B…{«§ýl{ç³-§ólÔŒæ Ð]l¬°Þ-´ë-Ísîæ ^èlrt… 1965 ( APM Ac-t-, 1965) {ç³M>Æý‡….. Ð]l¬°Þ-´ëÍ-sîæMìS çÜ…º…-«¨…-_¯]l BçÜ$¢-ÌS¯]l$, Úëç³#-ÌS¯]l$ A«¨-M>-Æý‡$Ë$ ïÜgŒæ ^ólíܯ]l ™èlÆ>Ó™èl ÐéÇ Ð]l¬…§ýlçÜ$¢ परवानगी A¯]l$Ð]l$† ÌôæMýS$…yé B ïÜâýæÏ¯]l$, ™éâê-ÌS¯]l$ ç³VýS$-ÌSVö-rtyýl… Ìôæ§é A{MýS-Ð]l$…V> ÌZç³ÍMìS {ç³Ðól-Õ…^èlyýl… A¯ól¨ A™èlÅ…™èl ¡{Ð]l-OÐðl$¯]l ^èlrt-ç³Æý‡-OÐðl$¯]l ¯ólÆý‡…. {糿¶æ$™èlÓ Ð]l¬{§ýl-ÌS¯]l$ «§ýlÓ…çÜ… ^ólíÜ-¯]l…-§ýl$MýS$ çܧýlÆý‡$ Ð]lÅMýS$¢-ÌSOò³ {MìSÑ$-¯]lÌŒæ MóSçÜ$Ë$ ¯]lÐðl*§ýl$ ^ólíÜ MýSv-¯]l-OÐðl$¯]l ^èlÆý‡ÅË$ ¡çÜ$MýS$¯ól ÒË$…-¨.

అధికార పార్టీ ఒత్తిడితో

తూతూమంత్రంగా ఫిర్యాదు!

అయితే, అధికారుల చర్యను సవాల్‌ చేస్తూ సదరు టీడీపీ నేత మున్సిపాలిటీ వేసిన అధికారిక సీళ్లను, తాళాలను పగులగొట్టి బుధవారం యథేచ్ఛగా షాపులను తెరుచుకోవడం కలకలం రేపింది. ప్రభుత్వ ముద్రలను బేఖాతరు చేస్తూ అక్రమంగా సీళ్లు తొలగించిన ఈ చట్టవిరుద్ధ వ్యవహారంపై మున్సిపల్‌ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఆ తాళాలు పగులగొట్టింది సదరు అధికార పార్టీ నేత అని అధికారులకు స్పష్టంగా తెలిసినప్పటికీ.. నేరుగా ఆయన పేరు మీద ఫిర్యాదు చేయకుండా, ‘వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ’ తూతూమంత్రంగా ఫిర్యాదు చేయడం వెనుక అధికార పార్టీ నాయకుల తీవ్ర ఒత్తిడి ఉందని మార్కెట్‌ వర్గాలు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి.

మార్కెట్‌లో షాపును సీజ్‌ చేస్తున్న మున్సిపాలిటి అధికారులు

మున్సిపాలిటీ సీజ్‌ ను తొలిగించి షాపులు తెరుచుకున్న దృశ్యం

Advertisement
 
Advertisement
Advertisement