కొడుకు మరణవార్త విని తల్లి ఆత్మహత్యా యత్నం | - | Sakshi
Sakshi News home page

కొడుకు మరణవార్త విని తల్లి ఆత్మహత్యా యత్నం

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

కుక్కను కొట్టడం అడ్డుకున్నందుకు దాడి

జమ్మలమడుగు: ఉగాండాలో ఉన్న పెద్ద కొడుకు గుండెపోటుతో మరణించాడనే వార్త విని తట్టుకోలేక ఓ తల్లి పురుగుల మందు (శనగ గుళికలు) తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. పెద్దముడియం మండలం మేడిదిన్నె గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి, లలిత దంపతుల పెద్ద కుమారుడు ఉద్యోగ నిమిత్తం ఉగాండా వెళ్లాడు. బుధవారం ఉదయం అతను గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు సమాచారం అందించారు. సాయంత్రం ఈ విషయం తెలిసిన తల్లి లలిత.. తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉన్న శనగ గుళికలు మింగేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే పట్టణంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లలిత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

తాగి డ్రైవింగ్‌: ఒకరికి జైలు, మరొకరికి జరిమానా

గోపవరం: మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు బద్వేలు ద్వితీయశ్రేణి మేజిస్ట్రేట్‌ కోర్టు బుధవారం ఒకరికి జైలు శిక్ష, మరొకరికి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. బద్వేలు రూరల్‌ సీఐ క్రిష్ణయ్య, ఎస్‌ఐ రంగారావు తెలిపిన వివరాల ప్రకారం.. మైదుకూరు టౌన్‌కు చెందిన లారీ డ్రైవర్‌ ఉప్పులూరు నరసింహులు గత నెల 30న మద్యం మత్తులో మితిమీరిన వేగంతో లారీ నడుపుతూ పట్టుబడ్డాడు. కోర్టులో నేరం రుజువు కావడంతో అతనికి 30 రోజుల జైలు శిక్ష పడింది. అలాగే, ఈ నెల 17న పి.పి.కుంట చెక్‌పోస్టు వద్ద మద్యం సేవించి బైక్‌ నడుపుతూ పట్టుబడిన నెల్లూరు జిల్లా కరటంపాడుకు చెందిన వీరదాసరి చక్రవర్తి అనే యువకుడికి రూ. 10,000 జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే క్రిమినల్‌ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు.

మదనపల్లె టౌన్‌: వీధి కుక్కను కొడుతున్న వారిని అడ్డుకున్నందుకు మహిళపై మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచిన ఘటన బుధవారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం, మదనపల్లె మండలం ఆరోగ్యవరం గ్రామానికి చెందిన ముస్తఫా కుటుంబం నివాసం ఉంటున్న వీధిలోకి ఓ కుక్క వచ్చింది. ఆ కుక్కను ఎదురింటికి చెందిన కొందరు వ్యక్తులు కరల్రతో కొడుతుండటాన్ని ముస్తఫా భార్య హసీనా (40) గమనించింది. వెంటనే అక్కడికి వెళ్లిన హసీనా.. కుక్కను కొట్టవద్దని అడ్డుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన ఎదురింటి వారు మూకుమ్మడిగా హసీనాపై దాడికి తెగబడ్డారు. కర్రలు, చేతులతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన హసీనాను కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై బాధితురాలి భర్త ముస్తఫా మదనపల్లె తాలూకా పోలీస్‌ స్టేషనన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

నరసింహులు చక్రవర్తి

Advertisement
 
Advertisement
Advertisement